ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పదవీ విరమణ పొదుపులను నిర్వహించడానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. పదవీ విరమణ కోసం డబ్బును డిపాజిట్ చేసుకోవాలనేది దీని ఉద్దేశ్యం. అయితే దీని నుండి డబ్బులని కొన్ని పరిస్థితులు ఎదురైతే తీసుకోవచ్చు. దీని నుండి డబ్బులు ని పెళ్లి ఖర్చుల కోసం తీసుకోవచ్చు. అయితే దీని కోసం EPFO నియమాలు, మార్గదర్శకాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. EPFO వివాహంతో ముడిపడి ఉన్న ఆర్థిక ఒత్తిడిని తెలుసుకుంది. అందుకే ఈ అవకాశం ఇస్తుంది. అర్హత కలిగిన చందాదారులు వివాహ సంబంధిత ఖర్చుల కోసం PF ఖాతా నుండి డబ్బును తీసుకోవచ్చు.
EPFO నిబంధనల ప్రకారం తన వివాహం కోసం లేదా తోబుట్టువుల వివాహం లేదా అతని పిల్లల వివాహం కోసం ఈ డబ్బు ని తీసుకోవచ్చు. 50% వరకు ఉపసంహరించుకోవచ్చు. కానీ అందరు అర్హులు అవ్వరు. కొన్ని రూల్స్ అయితే వున్నాయి.
ఉద్యోగి కనీసం ఏడేళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. ఐదేళ్లైతే చాలా అత్యవసరమైన సందర్భాల్లో పాక్షిక ఉపసంహరణను కలిపిస్తోంది. వివాహ ఆహ్వాన కార్డ్, ఉద్యోగి, జీవిత భాగస్వామి ఉమ్మడి ప్రకటన కావాలి. లేదంటే జనన ధృవీకరణ పత్రాలు లేదా వివాహానికి రుజువుగా డాక్యుమెంట్స్ ని ఇవ్వాల్సి వుంది. EPFO కార్యాలయానికి లేదా EPFO ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తును సబ్మిట్ చేయాల్సి వుంది.