కోరమండల్ ఘోర రైలు ప్రమాదం పై రంగంలోకి దిగనుంది సీబీఐ. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ ట్యాపరింగ్ జరిగినట్టు రైల్వే సేఫ్టీ కమిషన్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. లోకోపైలెట్ల వైఫల్యం లేదని నిర్ధారణకు రావడం.. కుట్ర కోణం వెలుగులోకి రావడంతో సీబీఐ దర్యాప్తు చేయనుంది. మొదటి నుంచి ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు బెంగాల్ సీఎం మమతా.
ఇక నేడు భువనేశ్వర్ లో కేంద్రమంత్రులు ధర్మేంద్రప్రదాన్, మాన్షుక్ మాండవీయలు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించానున్నారు. అటు సంక్లిష్టంగా మారిన మృతదేహాలు గుర్తింపు కొనసాగుతోంది. రైలు ప్రమాద దుర్ఘటన లో మొత్తం మరణాలు 280 దాటింది. వారిలో 57 మంది గుర్తింపు కాగా, పోస్ట్ మార్టం తర్వాత బంధువులకు అప్పగించారు. భువనేశ్వర్ లో 172 మృతదేహాలు ఉన్నాయి. ఎయిమ్స్ లో 100, ఎస్ యూ ఏం 20, కిమ్స్ లో 20, ఏ ఎం అర్ ఐ లో 6, క్యాపిటల్ హాస్పిటల్ లో 16 కు తరలించారు అధికారులు. ఆంధ్రా ప్రాంతంకు చెందిన ఒకరు మృతి చెందారు. గాయపడ్డ తెలుగు ప్రయాణీకులు మెరుగైన వైద్యం కోసం విశాఖ కు తరలించింది ఏపీ ప్రభుత్వం.