పరీక్ష ముందురోజే ఫోన్​కు PDF.. నీట్ పేపర్ లీకేజీపై CBI దర్యాప్తు ముమ్మరం

-

నీట్​ పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ఐపీసీలోని 120-బీ (నేరపూరిత కుట్ర), 420 (మోసం) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. నీట్‌లో అక్రమాలపై సీబీఐ పూర్తి స్థాయి విచారణ జరుపుతోంది. అలాగే బిహార్‌లో పేపర్‌ లీక్, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్‌ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా దర్యాప్తు చేయనుంది.

ఇప్పటి వరకు మొత్తం 18మందిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల్లో సంజీవ్‌ కుమార్‌ అలియాస్‌ లూటన్‌ ముఖియా గ్యాంగ్‌తో బలదేవ్ కుమార్ కుమ్మక్కయ్యాడని గుర్తించారు. నీట్ యూజీ సమాధాన పత్రం బలదేవ్​ ఫోన్​కు పీడీఎఫ్​ రూపంలో పరీక్ష ముందు రోజే వచ్చిందని తెలిపారు. దీనిని ప్రింట్లు తీసి తన దగ్గర రహస్యంగా ఉన్న విద్యార్థులకు పంపిణీ చేశాడని.. అయితే ఈ ప్రశ్నపత్రాన్ని ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాల నుంచి ముఖియా ముఠా సంపాదించిందని అధికారులు వెల్లడించారు. కాల్చేసిన పత్రాలను ఎన్‌టీఏ ప్రశ్నాపత్రంతో బిహార్‌ దర్యాప్తు బృందం పోల్చి చూసినప్పుడు సరైనవే అని తేలిందని, దీంతో పేపరు లీకవడం నిజమేనని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news