మ‌రో క‌రోనా టీకా వినియోగానికి కేంద్రం అనుమ‌తి

-

కేంద్ర ప్ర‌భుత్వం టీకా విషయంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనా నియంత్ర‌ణ‌కు మ‌రో టీకాను అత్య‌వ‌స‌ర వినియోగానికి కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో దేశంలో మ‌రో సింగిల్ డోస్ టీకా వినియోగానికి అందుబాటులోకి రానుంది. ర‌ష్యా కు చెందిన స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసు వినియోగానికి అనుమ‌తి ఇస్తున్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయ ప్ర‌క‌టించారు. కాగ ఈ స్పుత్నిక్ లైట్ సింగిల్ డోసు టీకాకు భార‌త ఓషధ నియంత్ర‌ణ మండ‌లి (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

కాగ ఇప్ప‌టికే దేశంలో జాన్స‌న్ అండ్ జాన్సన్ అనే సింగిల్ డోసు టీకా వినియోగానికి అనుమ‌తులు ఉన్నాయి. దీంతో దేశంలో రెండు సింగిల్ డోస్ టీకాలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే మొత్తంగా తొమ్మిది క‌రోనా నియంత్ర‌ణ టీకాలు భార‌త్ లో అందుబాటు లో ఉన్నాయి. కొవిషీల్డ్, కొవాగ్జిన్, మోడెర్నా, జాన్స‌న్ అండ్ జాన్స‌న్, కొవొవాక్స్, స్పుత్నిక్-వి, జైడ‌స్ క్యాడిలా, కార్బెవాక్స్ తో పాటు తాజాగా స్పుత్నిక్ లైట్.

Read more RELATED
Recommended to you

Latest news