ఐఫోన్, సాంసంగ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. కొత్త వర్షన్లు అప్డేట్ చేసుకోకుండా పాత వర్షన్లే వాడుతున్న ఐఫోన్ యూజర్ల ఫోన్లను హ్యాకర్లు సులువుగా హాక్ చేస్తున్నారని కేంద్రం తెలిపింది.
ఎక్కువగా 16.3.1, అంతకంటే ముందు వర్షన్లతో పాటు ఐఫోన్ 8, ఐపాడ్ ప్రో, ఐపాడ్ ఎయిర్ థర్డ్ జనరేషన్, ఐపాడ్ ఫిఫ్త్ జనరేషన్, ఐప్యాడ్ మినీ ఫిఫ్త్ జనరేషన్ ఫోన్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయని పేర్కొంది. సాంసంగ్ గెలాక్సీ యూజర్లు కూడా కొత్త వర్షన్లను అప్డేట్ చేసుకోవాలంది.