కేంద్రం ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్..!

-

తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఏపీ ప్రజలకి ఓ గుడ్ న్యూస్ ని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మోదీ సర్కార్ తాజాగా రెండు కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రజలకు కూడా లాభం కలగనుంది అని కేంద్రం అంది.

ఇది ఇలా ఉంటే మోదీ సర్కార్ ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్‌ 3 కింద యాస్పిరేషనల్ డిస్ట్రిక్స్, రూరల్ ఏరియాల్లో పెండింగ్‌లో వున్నా వర్క్ ని కంప్లీట్ చేయాలనీ ఆదేశాల్ని ఇచ్చింది. ఈ విషయం కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పడం జరిగింది. అయితే గిరిజన జనాభా అధికంగా ఉన్న 44 యాస్పిరేషనల్ డిస్ట్రిక్స్‌ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నిర్ణయించింది.

అయితే ఇందులో భాగంగా 1.4 లక్షలకు పైగా పొడవున రోడ్లను, 2626 బ్రిడ్జ్‌లను కంస్ట్రక్ట్ చేయనున్నారు. రూ.33,822 కోట్లు ఈ నిర్మాణం కోసం ఖర్చు చేయనున్నారు. అదే విధంగా రో నిర్ణయం కూడా తీసుకుంది. ట్రైబల్ ఏరియాస్‌లో టెలికం కనెక్టివిటీని పెంచనుంది. దీని కోసం ఐదు రాష్ట్రాల్లో 7287 గ్రామాల్లో టెలికం టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఒకటి. దీంతో ఈ గ్రామాల్లో 4జీ సర్వీసులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news