మహిళలకు సీఎం జగన్ గుడ్ న్యూస్…రేపటి నుండి కొత్త పథకం అమలు…!

మహిళా సాధికారతపై అసెంబ్లీలో నేడు చర్చ జరిగింది. చర్చ సందర్భంగా సీఎం తన ప్రసంగంలో గత ప్రభుత్వ తీరును.. ఇప్పటి ప్రతిపక్షం తీరును విమర్శించారు. మహిళా సాధికారత కోసం కొత్త పథకం ప్రారంభిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ నుంచి మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. వైఎస్సార్ జగనన్న ఇళ్ల పథకం ద్వారా ప్రతి మహిళా లబ్దిదారుకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల విలువ కలిగిన ఆస్తిని అందచేయాలని సంకల్పించామని చెప్పారు.

ఈ పథకం అమలై ఉంటే మహిళల చేతుల్లో రూ. 3 లక్షల కోట్ల విలువైన ఆస్తి ఉండేదని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతిపక్షం కోర్టులకు వెళ్లి అడ్డుకుందన్నారు. మంచి పనులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాన్ని దేవుడు శిక్షిస్తాడని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అందుకే కుప్పంలో దేవుడు మొట్టికాయలు వేశారు అంటూ సీఎం వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. అంతే కాకుండా కుప్పం ఓటమి తరవాత చంద్రబాబు ఫేస్ చూడాలి అంటూ కూడా సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.