దేశం లో కొత్త కరోనా వైరస్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండటం తో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అవుతుంది. ఈ సందర్భం గా రాష్ట్రాల కు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ లు రాసింది. ఓమిక్రాన్ వ్యాప్తి చాలా తీవ్రం గా ఉండటం తో.. రాష్ట్రాలు జాగ్రత్త గా ఉండాలని సూచించింది. అవసరం అయితే నైట్ కర్ఫ్యూ లను విధించాలని సూచించింది.
ఓమిక్రాన్ వేరియంట్ ను తెలికగా తీసుకోవద్దని రాష్ట్రాల కు సూచించింది. అలాగే దేశ వ్యాప్తం గా పలు రాష్ట్రాల లో కూడా కరోనా కేసులు కూడా పెరుగుతన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటి కే దేశ వ్యాప్తం గా పలు జిల్లాలో 10 శాతం కు మించి కేసులు వస్తున్నాయని తెలిపింది. ప్రజలు గుంపు లు గుంపు లు గా ఉండ కుండా ఆంక్షలు విధించాలని సూచించింది. తప్ప కుండా నైట్ కర్ఫ్యూ పై రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించు కోవాలని సూచించింది.