పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్‌ రైలు.. సవ్యంగా వెళ్లాలని కేంద్ర మంత్రి ప్రార్థనలు

-

ఒడిశాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఈ ప్రమాదంలో బోగీలు బోర్లా పడటంతో.. పట్టాలు ధ్వంసమయ్యాయి. దాంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన రైల్వే పట్టాల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టింది. రెండ్రోజులుగా.. వేల మంది సిబ్బంది కలిసి కఠోర శ్రమతో పలు పట్టాలను పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి బాలేశ్వర్ వద్ద పునరుద్ధరించిన పట్టాలపై ఓ రైలు ప్రయాణించింది.

బొగ్గును తీసుకెళ్తోన్న ఆ రైలు రూర్కెలా(ఒడిశా)వైపు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఉన్నారు. ఆ ప్రక్రియను పర్యవేక్షించారు. అప్పటికే రైలు ప్రమాదంతో చలించిపోయిన మంత్రి.. గూడ్స్‌ రైలు ప్రయాణిస్తోన్న సమయంలో ప్రార్థన చేశారు. చేతులు జోడించి నమస్కరించారు. దానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైల్వే శాఖ పట్టాలను రాకపోకలకు సిద్ధం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news