మణిపూర్ లో ఇంకా అల్లర్లు కొనసాగుతుండటంతో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్లాక్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ. 200, వంటనూనె కేజీ రూ. 250 వరకు అమ్ముతున్నారు. మందుల కొరతతో పాటు ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
ఇటీవల కేంద్రమంత్రి అమిత్ షా పర్యటించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు ఇరు వర్గాలకు పిలుపునిచ్చారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక బిల్లు కారణంగా మణిపూర్ రాష్ట్రము అంతటా హింసాత్మక పరిస్థితులతో దాదాపుగా నెల రోజుల నుండి అట్టుడుకుతోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అన్నీ మెల్ల మెల్లగా సర్దుమణుగుతున్నాయి. మణిపూర్ రాష్ట్రంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారు కూడా వెళ్లిపోయారు.