గ్యాస్ సిలిండర్ విషయం లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తోసుకుబోతుంది. గ్యాస్ సిలిండర్ బరువు విషయం లో ఈ నిర్ణయం ఉంటుందని తెలుస్తుంది. ఈ నిర్ణయం వల్ల 14.2 కిలో గ్రాములు ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ బరువు తగ్గ నుందని తెలుస్తుంది. లేదా.. గ్యాస్ సిలిండర్ విషయం లో మరో కీలక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజ్య సభ లో తెలిపారు. అయితే డొమెస్టిక్ సిలిండర్ బరువును దాదాపు 5 కిలో గ్రాముల బరువు ను తగ్గించే యోచన లో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు కేంద్ర మంత్రి మాటల్లో తెలుస్తుంది.
అయితే 14.2 కిలో గ్రాములు ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఎత్తడం.. తో పాటు ఇతర ప్రాంతాలకు తరలించడం వంటి విషయాల్లో సమస్యలు ఎదురు అవుతున్న సమయం లో ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే బరువు ను తగ్గించిన తర్వాత ఆ గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉంటుందనే విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.