పప్పు.. నూనె గింజలను అధికంగా సాగు చేయాలి.- మంత్రి నిరంజన్ రెడ్డి.

రాష్ట్రంలో యాసంగి సాగులో వరి ధాన్యాన్ని సాగు చేయవద్దని ప్రభుత్వం సూచిస్తోంది. ఇది వరకే యాసంగిలో బాయిల్డ్ రైస్  కొనమని కేంద్రం చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా యాసంగిలో బాయిల్డ్ రైస్ పండించ వద్దని రైతులను కోరింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం ఏమి సాగు చేయాలనే ఆలోచనలో తెలంగాణ రైతుల ఉన్నారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డి రైతులకు క్లారిటీ ఇచ్చారు. యాసంగిలో పంటల మార్పిడి ఎక్కువగా జరగాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతులు వరి పంట కాకుండా.. పప్పు, నూనె గింజలను అధికంగా సాగు చేయాలని సూచించారు. అదే విధంగా పంటల మద్దతు ధరకు కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో మార్కెట్ ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. డీపీఆర్ రాగానే సీఎం కేసీఆర్ ఆమోదం మేరకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.