ఉప్పుడు బియ్యంపై కేంద్రం కీలక నిర్ణయం

-

ఉప్పుడు బియ్యం ఎగుమతులపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశీయంగా వీటి ధరలను అదుపులో ఉంచడంతో పాటు, నిల్వలను సరిపడా అందుబాటులో ఉంచడం కోసం ఎగుమతులపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది. ఆగస్టు 25 నుంచే ఈ సుంకం అమల్లోకి రానుందని వెల్లడించింది. ఈ ఏడాది అక్టోబరు 16 వరకు ఈ నిబంధన కొనసాగుతుందని పేర్కొంది.

ఎల్‌ఈవో జారీ కానప్పటికీ ఇప్పటికే కస్టమ్స్‌ పోర్టుల్లో లోడ్‌ చేసి ఉంచిన పార్‌బాయిల్డ్‌ రైస్‌ కు ఈ సుంకం వర్తించదని ఆర్థికశాఖ వెల్లడించింది. సరైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ఉన్న ఎగుమతులకు కూడా సుంకం నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపింది.

ఇటీవల బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం అమలు చేయడంతో.. ఉప్పుడు బియ్యానికి డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా వీటి ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశీయంగా ఉప్పుడు బియ్యం నిల్వలను తగినంతగా అందుబాటులో ఉంచడంతో పాటు, రిటైల్‌ ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ సుంకం విధించింది.

Read more RELATED
Recommended to you

Latest news