Chandrayaan-3 : లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్ వరకూ 60 సెకన్లలో చూపించిన PIB

-

యావత్‌ భారత దేశం ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు దగ్గర్లోకి వచ్చేశాయి. కొన్ని గంటల్లో చంద్రయాన్‌ 3 జాబిల్లిపై అడుగుపెట్టబోతుంది. పీఐబీ ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ప్రయోగం లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని అందులో చూపించారు. జులై 14న శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3).. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.

ఈ క్రమంలోనే 40 రోజుల చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ PIB ఓ వీడియోను విడుదల చేసింది. ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 (Chandrayaan-3)ను రూపొందించినప్పటి నుంచి షార్‌ వేదిక వద్ద ప్రయోగం, రోదసిలోకి దూసుకెళ్లడం, భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారడం వరకూ అన్నీ ఇందులో చూపించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో మనం చూడొచ్చు.

విక్రమ్‌ ల్యాండర్‌ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్‌ రోవడ్‌ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్‌ రూపంలో వీడియోలను క్రియోట్‌ చేశారు. అనుకున్నట్లు అన్నీ జరిగితే.. రేపు సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ అడుగుపెట్టబోతుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు ల్యాండర్‌, రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను మనం రాయబోతున్నాం.

Read more RELATED
Recommended to you

Latest news