BRSలో మహిళా రిజర్వేషన్లను ఎందుకు పాటించలేదు : డీకే అరుణ

-

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నేత డీకే అరుణ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని అన్నారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ్‌.. నేను తిట్టినట్లు చేస్తా’.. అన్నట్లు నాటకం నడుస్తోందని ఆరోపించారు. ంమహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం దిల్లీలో ధర్నా చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు తమ పార్టీలోనే మహిళలకు ఇంకా టికెట్లు ఇవ్వాలని తన తండ్రిని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. వారి పార్టీలో మహిళకు రిజర్వేషన్లను ఎందుకు పాటించలేదని నిలదీశారు. దిల్లీలో దొంగ దీక్షలు చేసి బీఆర్ఎస్​లో ఏడుగురు మహిళలకు టికెట్ ఇచ్చారని వ్యాఖ్యానించారు.

“దేశవ్యాప్తంగా బీజేపీ.. మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. మహిళా బిల్లును పార్లమెంటులో భాజపా ఇప్పటికే రెండుసార్లు ప్రవేశపెట్టింది. భవిష్యత్‌లోనూ మహిళా బిల్లును ఆమోదించే సత్తా ఉన్న పార్టీ బీజేపీ. రక్షణశాఖ బాధ్యతలు మహిళకు అప్పగించిన పార్టీ మాది. కేంద్ర మంత్రివర్గంలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. కుమార్తె కవిత తప్ప మరే మహిళను కేసీఆర్‌ గౌరవించరు. 8 మంది మహిళలను గవర్నర్లుగా నియమించింది మా ప్రభుత్వం. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులు జరుగుతుంటే చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వ అధికారులకు రాజకీయ పిచ్చి పట్టుకుంది. రాజకీయాల్లోకి వచ్చేందుకు కేసీఆర్‌కు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు.” అని డీకే అరుణ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news