చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో పాముల కలకలం

-

ఇంతవరకు బంగారం స్మగ్లింగ్ చూసి ఉంటాం, డ్రగ్స్ స్మగ్లింగ్ చూసి ఉంటాం, కానీ బ్యాంకాక్ నుంచి చెన్నై విమానాశ్రయాని చేరుకున్న ఓ ప్రయాణికుడు పాముల స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డాడు. దీంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా పాములను చూసిన అధికారులు షాక్ కి గురయ్యారు. బ్యాంకాక్ ప్రయాణికుడి వద్ద ఐదు విషపూరితమైన పైథాన్ పాములను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.

లగేజ్ బ్యాగులో పాములను చూసి భయభ్రాంతులకు గురయ్యారు కష్టం బృందం. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా థాయిలాండ్ నుండి పాములను లగేజ్ బ్యాగులో దాచి తరలించే యత్నం చేశాడు ఓ కేటుగాడు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీలలో పాముల గుట్టుు బయటపడింది. దీంతో ప్రయాణికుడిని అరెస్టు చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news