జమిలీ ఎన్నికలపై స్పందించిన కాంగ్రెస్.. ఏమన్నదంటే..?

-

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఒకదేశం-ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలపై మాజీ ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర కేబినెట్ కి సమర్పించారు.  తాజాగా కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికలకు  ఆమోదం తెలిపింది కేబినెట్.

వనరులను ఆదాచేయడం, సామాజిక ఐక్యతను పెంపొందించడం, ప్రజా స్వామ్య నిర్మాణాన్ని బలంగా చేయడం, దేశ ఆకాంక్షలనుసాకారం చేయడంలో జమిలి ఎన్నికు సహాయపడుతాయని కమిటీ నివేదికలో పేర్కొంది. రామ్ నాథ్ కోవింద్ నివేదికను తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ చట్టంగా మారితే.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు 100 రోజుల వ్యవధిలో ఏకకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది. ఆ ఎన్నికలు నిర్వహించిన 100 రోజులకు కార్పొరేట్, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర స్థాయిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలి. కేవలం రెండు దశల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తే.. పరిపాలనకు సులభం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లుకు మద్దతు తెలపమని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news