ప్రపంచ దేశాలను కరోనా మరోసారి వణికిస్తోంది. రెండేళ్లు కాస్త గ్యాప్ తీసుకున్న కొవిడ్ మళ్లీ తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా భారత్‌పైనా విజృంభిస్తోంది. అయితే నాలుగు రోజుల నుంచి కాస్త మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లుగా కనిపిస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు దిగొస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో 3 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 1,82,294 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,962 కొత్త కేసులు బయటపడ్డాయి.
ప్రస్తుతం దేశంలో 36,244 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 7,873 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,43,92,828కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,606కి ఎగబాకింది.