ఒకే కాలేజ్ లో 66 మంది కి క‌రోనా పాజిటివ్

-

క‌రోనా వైరస్ మ‌ళ్లీ ప‌డ‌గ విప్పుతుంది. గ‌త కొద్ది రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతుంది. తాజా గా క‌ర్ణాటక రాష్ట్రం లో ని ధ‌ర్వాద్ లో ఒకే కాలేజ్ లో 66 మంది విద్యార్థుల కు క‌రోనా పాజిటివ్ అని తెలింది. అది కూడా ఒక మెడిక‌ల్ కాలేజ్ కావ‌డం గ‌మ‌నార్హం. కాగ క‌రోనా సోకిన వారంతా కూడా క‌రోనా నియంత్ర‌న వ్యాక్సిన్ లు తీసుకున్న వారే కావ‌డం విశేషం. దీంతో మెడిక‌ల్ కాలేజ్ యాజ‌మాన్యం అప్ర‌మ‌త్తం అయింది.

ఆయా విద్యార్థులు ఉంటున్న రెండు హ‌స్ట‌ళ్ల ను మూసివేసింది. అలాగే ఈ 66 మంది కి ప్రైమ‌రీ కాంటాక్ట్ లో ఉన్న వారంద‌రినీ దాదాపు 400 మంది ని క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ పరీక్ష ల కు పంపించారు. కాగ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కాస్తా తగ్గుతుంది.. అని అనుకునే లోపే ఇలాంటి వార్త లు రావ‌డం కాస్త ఆలోచించాల్సిన విష‌యం గా మారింది. కాగ ఇప్ప‌టి కూడా చాలా మంది క‌రోనా వైర‌స్ విష‌యంలో క‌నీస జాగ్ర‌త్త లు పాటించ‌డం లేదు. దీని వ‌ల్లే కరోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ గా పెరుగుతుంది. వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా క‌రోనా వైర‌స్ విష‌యం లో క‌నీస జాగ్ర‌త్త లు తీసుకోవాల‌ని వైద్య అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news