ఇక్కడ ఎవడి గురించి వాడే పట్టించుకోవాలి… గుర్తుపెట్టుకోండి ప్లీజ్!

-

అధికారం వచ్చే వరకూ ప్రజల గురించి నిత్యం పట్టించుకున్నట్లుగా మాట్లాడే రాజకీయ నాయకులు… ఒక్కసారి కుర్చీ ఎక్కాక.. ఆర్థిక వ్యవస్థలపైనే అధిక దృష్టి సారిస్తుంటారు. వారికి ఆ సమయంలో అన్నింటికంటే అదే అధిక ముఖ్యమైన విషయం. ఈసమయంలో నాయకులకు లేకపోయినా… జనాలు అయినా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించుకోవాలి… లేదంటే ఊహించని పరిణామాలు ఎదుర్కోక తప్పదు!


కరోనా అంటే చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు.. ప్రధాన మంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవును… టెస్టుల విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తుంటే… అన్ లాక్ పేరు చెప్పి మోడీ ఆల్ మోస్ట్ చేతులు ఎత్తేశారు. బ్రతికుంటే బలుశాకైనా తిని బ్రతకొచ్చని మొదట్లో చెప్పిన వారే.. నేడు ఎవడి చావు వాడు చావండి అన్న స్థాయిలో కరోనాను లైట్ తీసుకుంటున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏ రాష్ట్ర వారు మరే రాష్ట్రానికైనా ఎలాంటి అనుమతులూ లేకుండా వెళ్లొచ్చని చెప్పుకొచ్చారు మోడీ! అన్ లాక్ ల పేరిట ఇప్పటికే అల్లకళ్లోలం చేసేశారు! దేశంలో మొదటి లక్ష కేసులు రావడానికి వందరోజులు పైగా సమయం పడితే… ఐదో లక్ష చేరుకోవడానికి కేవలం ఆరు రోజులే పట్టిందంటే కరోనా ఏ స్థాయిలో చాపకింద నీరులా వ్యాప్తిస్తుందో అర్ధం చేసుకోవచ్చు!! లాక్ డౌన్ అనే పదం చాలా మందికి జోక్ గా సరదాకా సిల్లీగా అనిపిస్తుండొచ్చు కానీ.. ఒకసారి సామాజిక వ్యాప్తి మొదలైతే అప్పుడు ఉంటాది అసలు మజా.. అప్పుడుంటాది కరోనా అంటే ఏమిటో అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సో… ప్రధానులకు, ముఖ్యమంత్రులకు ప్రజల కష్టాలు, ప్రజల సమస్యలు పట్టకపోవచ్చు. అలా పట్టించుకునేవారైతే… పెట్రోల్ ధరలు అలా ఎందుకు పెంచుకుంటూ పోతారు.. పట్టించుకునేవారైతే కరోనా టెస్టుల విషయంలో.. లాక్ డౌన్ ల విషయంలో అంత నిర్లక్ష్యంగా ఎందుకుంటారు? సో… ఇక్కడ ఎవడి ఆరోగ్యం గురించి వాడే పట్టించుకోవాలి.. ఎవరి సమస్యలు వారే తీర్చుకోవాలి. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఎందుకున్నారు మరి అంటే… ఉన్నారంతే??

Read more RELATED
Recommended to you

Latest news