ముంబైలో మ‌రో 30 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా.. మొత్తం 260

క‌రోనా వైర‌స్ డాక్ట‌ర్ల పై తీవ్ర ప్ర‌తాపం చూపిస్తుంది. ముఖ్యం గా ముంబై న‌గ‌రంలో భారీ సంఖ్య‌లో డాక్ట‌ర్లకు క‌రోనా వైర‌స్ సోకుతుంది. తాజా గా 30 మంది రెసిడెంట్ డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఒక ముంబై లోనే 260 మంది రెసిడెంట్ డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఈ 260 మంది డాక‌ర్ల‌కు కూడా కేవ‌లం నాలుగు రోజుల్లోనే క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. తాజా గా న‌మోదు అయిన 30 డాక్ట‌ర్లు ముంబై న‌గ‌రంలోని సియోన్ ఆస్ప‌త్రికి చెందిన వారని మ‌హారాష్ట్ర రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు తెలిపారు.

న‌గ‌రంలో క‌రోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్న క్ర‌మంలోనే తాము కూడా క‌రోనా బారీన ప‌డుతాన్నామ‌ని మ‌హారాష్ట్ర రెసిడెంట్ డాక్ట‌ర్స్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు తెలిపారు. కాగ మ‌హారాష్ట్రలో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజు వేల సంఖ్యలో పెరుగుతుంది. దేశంలోనే అత్య‌ధికంగా క‌రోనా, ఓమిక్రాన్ కేసులు మ‌హారాష్ట్రలోనే న‌మోదు అవుతున్నాయి.