సీఎం కేసీఆర్ ను జైలుకు పంపిస్తా : బండి సంజయ్

-

మాకు జైళ్లు కొత్తకాదు.. 9 సార్లు జైలు కి వెళ్ళా.. కేసీఆర్‌ ను కూడా జైలుకు పంపిస్తానని బండి సంజయ్ వార్నింగ్‌ ఇచ్చారు. నేను ఉపాధ్యాయులు ఉద్యోగుల కోసం జైలుకి పోయానని.. 317 జీవోను మాత్రం సవరించాలని మళ్లీ డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. నీ సంగతెంటో తెలుస్తానని.. ఉపాధ్యాయులు అందరితో చర్చించు వాళ్ళకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు కు అండగా మేము ఉంటామని… ఎవరు బయపడవద్దని కోరారు. ఉపాధ్యాయులు ఉద్యోగులు రైతులు కోసం నిరుద్యోగుల కోసం మళ్లీ జైలుకు వెళ్తానని.. నా ఆఫీస్ బద్దలు కొడతావా.. నీ అంతు చూస్తానని హెచ్చరించారు.

ధర్మము కోసం పనిచేసే వ్యక్తులము తామని… బలి దానాలకు సిద్ధమైన పార్టీ మాది మీలాంటి తుప్పేలు పార్టీ కాదని చెప్పారు. గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ ను బద్దలు కొడతావా… మహిళలు ఉన్నా ఇంత దుర్మార్గం గా వ్యవహరిస్తావా అని ఫైర్‌ అయ్యారు. ప్రశ్నిస్తే జైలుకు పంపుతావా ? జైల్లో ఉన్న వారి కుటుంబాలు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారని వెల్లడించారు. అవినీతి కుబేరుడు కెసిఆర్ అని.. హైకోర్టు నిన్ను తప్పు బట్టిందని చురకలు అంటించారు. విడుదల చేయమన్నా విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసావని.. నువ్వు ఎంత క్రూరుడువో ప్రజలకు తెలిసిందన్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news