ఏపీ లో రికవరీ రేట్ బాగుంది: కేంద్రం

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.6 మిలియన్లకు పైగా రోగులు కోరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) కోలుకున్నారని, వీరిలో ఎక్కువ మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో సహా ఐదు రాష్ట్రాలకు చెందినవారని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శుక్రవారం మరియు శనివారం ఉదయం మధ్య 81,533 మంది కోవిడ్ -19 రోగులు పూర్తిగా వ్యాధి నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోనా రికవరీల సంఖ్య 3,624,196 కు చేరుకుంది. ఇందులో 60% కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ నుంచే రికవరీ అయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజు 14 వేల మంది కరోనా నుంచి కోలుకుని బయటపడ్డారు. కర్ణాటకలో 12 వేల మందికి పైగా కరోనా కోరుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.