భార్యకు బొద్దింకల భయంతో 18 సార్లు ఇల్లు మారిన భర్త.. చివరకు విడాకులు తీసుకోవాలని నిర్ణయం..!

-

బొద్దింకలు అంటే సహజంగానే చాలా మందికి భయం ఉంటుంది. ఇక మహిళలకు అయితే ఆ భయం గురించి చెప్పాల్సిన పనిలేదు. వారు ఎక్కువగా భయపడతారు. బొద్దింక పేరు చెబితేనే ఒంటిపై తేళ్లు, జెర్రిలు పాకినట్లు భావిస్తారు. ఒళ్లంతా కంపరం పుట్టినట్లు ప్రవర్తిస్తారు. అయితే ఇది సహజమే. కానీ ఆ భయం మరీ విపరీతంగా ఉంటేనే సమస్యలు వస్తాయి. ఆ జంటకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

- Advertisement -

couple changed home 18 times because of wife cockroach fear

భోపాల్‌కు చెందిన ఓ జంటకు 2017లో వివాహం అయింది. 2018లో భర్త తన భార్యకు బొద్దింకలు అంటే విపరీతమైన భయం ఉండడాన్ని గమనించాడు. ఆమె ఒక రోజు కిచెన్‌లో బొద్దింకను చూసి అరుస్తూ భయంతో బయటకు పరుగెత్తింది. తరువాత ఎంత సర్ది చెప్పినా ఆమె కిచెన్‌లోకి వెళ్లలేదు. ఆ ఇంటి నుంచి వేరే ఇంటికి మారుదామని చెప్పింది. దీంతో అతను సరేనని ఇంకో ఇంటికి మకాం మార్చాడు. అయితే అక్కడ కూడా ఇలాగే బొద్దింకలు ఆమెను భయ పెట్టాయి. దీంతో ఇంకో ఇంటికి మారారు. అలా వారు ఇప్పటికి 18 సార్లు ఇళ్లు మారారు. కారణం.. ఆ మహిళకు బొద్దింకలు అంటే విపరీతమైన భయం ఉండడమే.

అయితే తన భార్యకు ఉన్న ఆ ఫోబియాను పోగొట్టడానికి ఆ భర్త ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆమెను మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాడు. కానీ ఆమె చికిత్సకు నిరాకరించింది. మందులను కూడా తీసుకోలేదు. పైగా రోజు రోజుకీ ఆమె ప్రవర్తనలో ఇంకా మార్పు రాసాగింది. దీంతో విసిగి వేసారిన ఆ భర్త విడాకుల కోసం దరఖాస్తు చేశాడు. ఈ క్రమంలో కోర్టు ప్రస్తుతం వీరి పిటిషన్‌ను విచారిస్తోంది. వీరి కేసులో ఏమని తీర్పు ఇస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...