కరోనా వైరస్ ను నియంత్రించడానికి ఉపయోగిస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు త్వరలోనే బహిరంగ మార్కెట్లోకి రానున్నట్టు తెలుస్తుంది. ఈ రెండు వ్యాక్సిన్లను రెగ్యూలర్ మార్కెట్లో అందుబాటులో ఉండే విధంగా అనుమతి ఇవ్వాలని డీసీజీఐకి ఒక నిపుణుల కమిటీ సిఫార్సు చేసినట్టు సమాచారం. అయితే ఈ కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను రెగ్యూలర్ మార్కెట్లో లభించే విధంగా అనుమతులు ఇవ్వడానికి డీసీజీఐ కూడా సుముఖంగా ఉందని సమాచారం. కాగ దీని పై త్వరలోనే అధికారికంగా డీసీజీఐ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.
కాగ కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను రెగ్యూలర్ మార్కెట్లో విక్రయించేందుకు అనుమతులు కావాలని డీసీజీఐ కి ఇప్పటికే సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లేఖ రాశాయి. ఈ లేఖలో వ్యాక్సిన్ల సామర్థ్యాలు, తయారీ వివరాలు, క్లినికల్ ట్రాయల్స్ కు సంబంధించిన వివరాలను కూడా జోడించారు. అయితే భారత్ బయోటెక్ కొన్ని వివరాలు ఇవ్వలేదని తెలుస్తుంది. త్వరలోనే భారత్ బయోటెక్ పూర్తి సమాచారం ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నట్టు సమాచారం. కాగ మన దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ లను అత్యవసర వినియోగానికి డీసీజీఐ గతంలోనే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.