IND vs SA: చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్స్‌.. భారత్‌‌కు తప్పని పరాజయం!

-

తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 31 పరుగుల తేడాతో ఇండియా ఘోర పరాజయం పాలైంది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సఫారీలు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేశారు. కెప్టెన్‌ టెంబా బవుబా 110, రాసీ వాన్‌ డెర్‌ డస్సెన్‌ 129 పరుగులతో చెలరేగారు. నాలుగో వికెట్‌ కు 204 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీయగా.. అశ్విన్‌ ఓ వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. శిఖర్‌ ధావన్‌ 79 పరుగులు, కోహ్లీ 51 పరుగులు శార్దూల్‌ ఠాకూర్‌ 50 పరుగులతో రాణించగా… ఇక మిడిలార్డర్‌ పూర్తిగా విఫలమైంది. సఫారీ బౌలర్లలో లుంగీ ఎంగిడి, షంసీ, పెహ్లు క్వాయో రెండేసి వికెట్లు తీయగా.. మహరాజ్‌, మార్‌ క్రమ్‌ చెరో వికెట్‌ తీశారు. దీంతో సౌతాప్రికా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news