చలికాలంలో ఈ ఎనిమిది సూపర్ ఫుడ్స్ ని కచ్చితంగా తీసుకోండి..!

-

చలికాలంలో ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తొలగిపోతాయి అదే విధంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ వుంటాయి. అందుకనే మంచి పోషక ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. చలికాలంలో కచ్చితంగా ఈ 8 సూపర్ ఫుడ్స్ ని తీసుకుంటే సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.

నెయ్యి:

నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. జీర్ణ సమస్యలను ఇది తొలగిస్తుంది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఉల్లిపాయల్ని నెయ్యిలో వేయించి తీసుకుంటే గొంతు ఫ్రీ అవుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి వీటిలో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. హృదయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

అల్లం:

అల్లం జీర్ణ సమస్యలని తగ్గిస్తుంది అలాగే రోగనిరోధకశక్తిని పెంచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చలికాలంలో అల్లం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది.

క్యాబేజ్:

క్యాబేజీ లో కూడా పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, మాంగనీస్, పొటాషియం, విటమిన్ బి సిక్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా చలికాలం తీసుకుంటూ ఉండండి.

బెల్లం:

బెల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జీర్ణసమస్యలని ఇది తొలగిస్తుంది. అలానే ఇతర అనారోగ్య సమస్య నుండి దూరంగా ఉంచుతుంది.

కుంకుమ పువ్వు:

కుంకుమ పువ్వు మూడ్ ని లిఫ్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది మరిగించిన పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని తాగితే చాలా మంచిది.

బీట్ రూట్:

బీట్ రూట్ లో పొటాషియం బీటా-కెరోటిన్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి కనుక బీట్రూట్ ని కూడా చలికాలంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

నట్స్ మరియు గింజలు:

ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పోషక పదార్ధాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి కనుక రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news