గుడ్ న్యూస్‌: తగ్గుతున్న కరోనా పాజిటివిటీ రేటు

-

కొవిడ్‌-19 ప్ర‌పంచాన్ని ఎంత‌లా గ‌డ‌గ‌డ‌లాడించిందో అంద‌రికీ తెలిసిందే.. కంటికి క‌నిపించని వైర‌స్ ప్ర‌తి ఇంటినీ భ‌య‌పెట్టింది. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి దాటికి అన్ని రంగాలు కుదేల‌య్యాయి. ల‌క్ష‌లాది మంది ఉద్యోగాలు పోగొట్టుకోగా…కోట్లాది మంది ఉపాధి కోల్పోయిన ద‌య‌నీయ ప‌రిస్థితి ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ్యాధికి ఎలాంటి టీకాగానీ, మందుగానీ అందుబాటులోకి రాలేదు. అయితే క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అంద‌రికీ ఊర‌ట‌నిస్తున్న‌ది. అదేంటంటే… భారత్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రభుత్వంతో పాటు సాధారణ ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతున్నది.

కరోనా పాజిటివిటీ రేటు దేశంలో గణనీయంగా తగ్గుతూ వస్తోంద‌ని, గడచిన మూడు వారాల్లో ఇది 6.8 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ భూషణ్ తెలిపారు. ఆయ‌న తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు సుమారు 8 కోట్ల 80 లక్షల శాంపిల్స్‌ను పరిశీలించారు. గడచిన వారంలో వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య పాజిటివ్ కేసుల సంఖ్య కన్నా అధికంగా ఉంది. ఇదే సమయంలో పాజిటివిటీ రేటు అత్యంత వేగంగా తగ్గడం కూడా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు అధికారులు ప్రస్తుత చల్లని వాతావరణం, పండుగల సీజన్ కారణంగా కరోనా కేసులు పెరుగుతాయనే అనుమానం వ్యక్తం చేస్తుండ‌టం గ‌మనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version