ఈ నెల 21న దిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం

-

దిల్లీలో ఈ నెల 21వ తేదీన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 19వ తేదీన విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా రెండు రోజుల తర్వాత సీడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్‌ ఏర్పాటు చేసింది.

డిసెంబర్‌ 19వ తేదీన విపక్షాల కూటమి భేటిలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్‌ గాంధీ యాత్రపై సీడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది. పాదయాత్ర సహా హైబ్రిడ్‌ మోడ్‌లో ఈ యాత్రను నిర్వహించనున్నారు. త్వరలోనే దీనిపై కాంగ్రెస్‌ పార్టీ తుదినిర్ణయం తీసుకోనుంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను, గెలుపు వ్యూహాలను కాంగ్రెస్‌ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news