Ayodya : అయోధ్యలో నేటి నుంచి భక్తులకు బాలరామచంద్రుడి దర్శనం కల్పించనున్నారు. రఘునందనుడి దర్శనానికి ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్ లు ఖరారు చేసింది. ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు స్వామివారి దర్శనం కల్పించనుంది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆలయ యంత్రాంగం చర్యలు చేపట్టింది.
కాగా, ఆయోధ్య లో శ్రీరాముని రామ మందిరం నిర్మాణానికి ఎంతోమంది ప్రముఖులు తమవంతుగా విరాళాలు ఇచ్చారు. అలాగే సామాన్య భక్తులు కూడా తమకు తోచిన విరాళం ఇచ్చారు. అయితే.. ఇటీవల గుజరాత్ లో నీ సూరత్ కు చెందిన భవికా మహేశ్వరి అనే14 ఏళ్ల బాలిక రామ మందిరానికి రూ. 52 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఇంత చిన్న వయసు లోనే పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చినందుకు బాలిక రామ భక్తుల నుంచి ప్రశంసలు అందు కుంటుంది.