తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలబెడతా – మంత్రి కోమటిరెడ్డి

-

తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 గా నిలబెడతానని తైక్వాండో క్రీడా టోర్నీ బహుమతుల ప్రధానోత్సవంలో రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. క్రీడలు యువకులు, పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక దృఢత్వాన్ని కలిగిస్తాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న తైక్వాండో ప్రీమియర్ లీగ్ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మర్షల్ ఆర్ట్స్ డ్రెస్ ధరించి క్రీడాకారులతో సరదాగా పోటీపడి వారిలో ఉత్సాహం నింపారు.

అనంతరం మాట్లాడిన మంత్రి తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారతకు మెరుగైన విధానాలకు రూపాకల్పన చేసిందని చెప్పారు. ప్రపంచంలో మెన్ & విమెన్ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ తైక్వాండో ప్రీమియర్ లీగ్ మన హైదరాబాద్ లో నిర్వహించడం చాలా మంచి విషయం. తెలంగాణ క్రీడాకారులకి ఇది ఒక గొప్ప అవకాశమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన క్రీడా ప్రణాళిక రాచించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డివెంకట్ రెడ్డి తెలిపారు. అనంతరం పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకి, కొరియన్ తైక్వాండో అధికారులతో కలిసి మంత్రి బహుమతులను ప్రధానం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news