దీపావళికి అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్తగా సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నట్లు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అనుకోని సంఘటనలు జరిగిన వెంటనే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవాలనే ఉద్దేశంతో సెలవులు రద్దు చేస్తున్నట్లు డీజీ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 101కు ఫోన్ చేయాలని సూచించారు.
ఇక అటు రైళ్లలో టపాసులు తీసుకెళ్లేవారికి రైల్వేశాఖ హెచ్చరికలు జారీచేసింది. రైల్వే స్టేషన్లు, ట్రైన్ లలో క్రాకర్స్ తీసుకెళ్తూ దొరికితే రూ. 1000 ఫైన్ లేదా మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. నేర తీవ్రతను బట్టి రెండు ఉండే అవకాశం ఉందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఎవరైనా అనుమానస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు తీసుకెళుతున్నట్లు కనిపిస్తే 139 హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.