దిల్లీ జామా మ‌సీదులో అమ్మాయిలకు నో ఎంట్రీ

-

దిల్లీలో జామా మ‌సీదులో మ‌హిళ‌ల ఎంట్రీపై నిషేధం విధించారు. అమ్మాయిలు సింగిల్‌గా కానీ, గ్రూపులుగా కానీ మ‌సీదులోకి రావొద్దని గేట్ల వ‌ద్ద నోటీసులు అతికించారు. ఈ అంశంపై దేశ రాజ‌ధాని వివాదం చెల‌రేగుతోంది. జామా మ‌సీదు షాహి ఇమామ్ స్పందిస్తూ ఆ నోటీసులు ప్రార్థ‌న‌లు చేసే అమ్మాయిల‌కు వ‌ర్తించ‌వ‌ని స్పష్టం చేశారు.

మ‌హిళ‌ల ఎంట్రీపై నిషేధం విధించ‌డం ప‌ట్ల కొన్ని మ‌హిళా హ‌క్కుల సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. మ‌సీదు నిర్ణ‌యం ఆమోద‌యోగ్యంగా లేద‌న్నాయి. 17వ శ‌తాబ్ధంలో మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు నిర్మించిన మ‌సీదుకు ప్ర‌తి రోజు వేలాది మంది టూరిస్టులు వ‌స్తుంటారు. మ‌సీదు నిర్ణ‌యాన్ని ఖండిస్తూ దిల్లీ మ‌హిళా సంఘం జామా మ‌సీదుకు నోటీసులు జారీ చేసింది.

మ‌సీదు ఆవ‌ర‌ణ‌లో కొన్ని అభ్యంత‌ర‌క‌ర సంఘ‌ట‌న‌లు జరుగుతున్నాయ‌ని షాహి ఇమాబ్ స‌య్యిద్ అహ్మ‌ద్ బుకారి తెలిపారు. జామా మ‌సీదు ఓ ప్రార్థ‌నా స్థ‌ల‌మ‌ని, ప్రార్థ‌న‌ల కోసం వ‌చ్చేవారిని స్వాగ‌తిస్తామ‌ని స్పష్టం చేశారు. కానీ డేటింగ్ కోసం వ‌చ్చే మ‌హిళ‌ల్ని నిషేధిస్తున్నామ‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news