గుజరాత్​లో వజ్ర గణపతి..విలువ ఎంతో తెలిస్తే షాక్

-

దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు కూడా షురూ అయ్యాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా చాలా ప్రాంతాల్లో వెరైటీ వినాయకులను ప్రతిష్ఠించారు. చాలా చోట్ల ఏర్పాటు చేసిన చంద్రయాన్-3 గణేశుడు అందర్నీ ఆకర్షిస్తున్నాడు. ఓ చోట వెండి వినాయకుడిని ఏర్పాటు చేశారు.

మరోవైపు గుజరాత్‌లోని సూరత్‌లో ఏకంగా వజ్రాల గణపయ్య దర్శనమిస్తున్నాడు. సూరత్ వజ్రాల వ్యాపారి కనుభాయ్‌ అసోదరియా ఏటా వజ్ర గణపతికి పూజలు చేస్తారనే విషయం తెలిసిందే. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని ఏడాదికి ఒక్కరోజు మాత్రమే బయటకు తీస్తారు. ఆ రోజున ప్రత్యేక దర్శనానికి భక్తులను కూడా అనుమతిస్తారు. కోహినూర్‌ వజ్రం కంటే పెద్ద పరిణామంలో ఉండే ఈ మహాగణపతి ధర గురించి కనుభాయ్ చెప్పకపోయినా మార్కెట్లో దీని విలువ రూ.600 కోట్లు ఉంటుందని సమాచారం.

ఈ వజ్ర గణపయ్య స్టోరీ ఏంటంటే.. పదిహేనేళ్ల క్రితం వ్యాపార నిమిత్తం కనుభాయ్‌ బెల్జియంకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అక్కడి నుంచి ముడి వజ్రాలను భారత్‌కు తీసుకొచ్చారు. అందులోని ఒక వజ్రం గణపతి ఆకారంలో ఉన్నట్లు కనుభాయ్ తండ్రికి కల వచ్చిందట. పరిశీలించి చూస్తే.. ఒక వజ్రం ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి ఆకారంలో ఉందట. అందుకే అప్పటి నుంచి ఈ వజ్ర గణపతికి ఆ కుటుంబం పూజలు చేస్తూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news