స్కిల్ స్కాం కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారించేందుకు సిఐడి అధికారులు విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు బయలుదేరారు. అయితే ఆయనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించవద్దని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఉదయం 9:30 గంటలకు విచారణ ప్రారంభం కానుండగా… కస్టడీలోకి తీసుకునే ముందు బాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. విచారణ సందర్భంగా గంటకు ఐదు నిమిషాలు CBNకు బ్రేక్ ఇస్తారు.
ఇది ఇలా ఉండగా, 3300 కోట్లు ప్రాజెక్టుగా ఎలా నిర్ణయం చేశారు? సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరు తో జీవో ఎలా ఇచ్చారు? అగ్రిమెంట్ ఏ విధంగా జరిగింది? అని చంద్రబాబుకు ప్రశ్నలు సంధించనుంది సిఐడి బృందం. జీవో కి విరుద్ధంగా ఒప్పందం ఉండడం ఏంటి? ఆర్థిక శాఖ అభ్యంతరాలు పట్టించుకోకుండా నిధులు విడుదల చేయమని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏంటి? 13 చోట్ల నోట్ పైళ్ళపై సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు? డిజైన్ టెక్ కంపెనీకి చేరిన నిధులు తరలించడం గురించి మీకు తెలుసా? అని ఆడగనుందట సిఐడి బృందం.