Disney India : రిలయన్స్ ఇండస్ట్రి అధినేత ముఖేష్ అంబానీ గురించి ఆయన సంపన్నమైన జీవితం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖేష్ అంబానీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ప్రతి విషయంలో కూడా లగ్జరీ గానే ఆయన తన జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికీ ఇండియా లోనే టాప్ ఫైవ్ ధనికుల్లో ఒకరు ముఖేష్ అంబానీ.

ఇది ఇలా ఉండగా, ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ డిస్నీ ఇండియాలో తన వ్యాపారాలను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సరైన కొనుగోలుదారులు లభిస్తే డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి విభాగాలను విక్రయించనుంది. ఇటీవలే ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ ను డిస్నీ కోల్పోగా… ఈ హక్కులు దక్కించుకున్న రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 డిస్నీని కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనిపై రెండు సంస్థలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.