బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు.. ఢిల్లీలో షేక్ హసీనా..!

-

బంగ్లాదేశ్ గత కొద్ది రోజుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హసీనా ప్రధాని పదవీకి రాజీనామా చేసింది. భారత జాతీయ భద్రతా వైఖరీని హసీనాకు తెలియజేశారు. షేక్ హసీనాను రహస్య ప్రాంతానికి తరలివెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ ఆశ్రయం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పార్లమెంట్ ను ప్రెసిడెంట్ తాజాగా రద్దు చేశారు.  షేక్ హసీనా ఢిల్లీలోనే ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు.

హసీనాకు 45 నిమిషాల్లో వెళ్లిపోవాలని డెడ్ లైన్ విధించారు. బంగ్లాదేశ్ లో ఇంకా పూర్తిగా కంట్రోల్ కాలేదు అల్లర్లు. మరోవైపు షేక్ హసీనా తన నివాసం నుంచి వెళ్లిపోగానే నిరసన కారులు ఆమె నివాసం వద్దకు వెళ్లి హల్ చల్ చేశారు. వస్తువులను ధ్వంసం చేసారు. మాంసాహారాన్ని భుజించారు. అనంతరం కొన్ని కోళ్లను, వస్తువులను దొంగిలించుకొని తీసుకెళ్లారు. బంగ్లాదేశ్ లో త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news