కేంద్ర ప్రభుత్వం : వారికి ఆధార్ నెంబర్, ఓటీపీ చెప్పొద్దు..!

-

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలని ఎలర్ట్ గా ఉండమంటోంది. సీనియర్ సిటిజన్స్ ని ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. అయితే ఎందుకు కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలని ఎలర్ట్ గా ఉండమంటోంది…? అసలు ఏమైంది…? ఈ విషయం లోకి వస్తే… ఇప్పుడు మోసగాళ్లు కాల్ చేసి కరోనా వ్యాక్సిన్ కేటాయింపు అంటూ మోసం చేస్తున్నారు అని ప్రజలకి చెప్పడం జరిగింది. అయితే మోసగాళ్లు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు మీ ఆధార్ నెంబర్, ఓటీపీని అడిగి మోసాలకు పాల్పడుతున్న నేపథ్యం లో ఇలా చెప్తోంది కేంద్రం.

మోసగాళ్లు ఇప్పుడు మరో కొత్త రకం మోసాలతో ప్రజలని మోసం చేస్తున్నారు. దీని మూలం గానే మోదీ సర్కార్ కూడా ప్రజలను హెచ్చరిస్తోంది. అందుకే ఎవరినీ కూడా ఈ మోసగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలని కేంద్రం ఇలా ప్రకటించడం జరిగింది. అయితే ఈ కొత్త రకం మోసం లో
కరోనా వ్యాక్సిన్ కోసం అంటూ కాల్ చేసి… డ్రగ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాల్ చేస్తున్నట్లు మోసగాళ్లు చెబుతారు… వివరాలని తెలుసుకుంటున్నారట.

అలానే కరోనా వ్యాక్సిన్ వచ్చిందంటూ…. మీ ఆధార్ నెంబర్, ఓటీపీ చెప్పాలని కోరతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కోవిడ్ 19 వ్యాక్సిన్ పొందాలని భావిస్తే ఆధార్ నెంబర్, ఓటీపీ చెప్పండి అంటూ ఫోన్ చేస్తున్నారు. కనుక ఇటువంటి వాళ్ళ బారిన పడొద్దు అని పీఐబీ ప్యాక్ట్ చెక్ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news