ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాలయం ముందు దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆందోళన

-

ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాలయం ముందు దుర్గం చిన్నయ్య బాధితురాలు శేజల్ ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య బాధితురాలి శేజల్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్… దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలకి రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే చిన్నయ్య ను పార్టీ నుండి సస్పెండ్ చేసి,కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఎమ్మేల్యే కి హైదర్ గూడ లో ఇచ్చిన 404 ఫ్లాట్ ను బ్రోతల్ హౌస్ గా మార్చిన ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి కైన తెలంగాణ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అసలు వాస్తవాలను 5 కోట్ల మంది ప్రజలు కి తెలియజేయాలన్నారు శేజల్. ఆరిజిన్ డైరీ విషయం లో నే కాకుండా ఎమ్మేల్యే మరియు ఎమ్మేల్యే అనుచరులు భీమా గౌడ్,గోలి శివ లు చేసిన భూ కబ్జాల మీద విచారణ చేసి నిజాలను ప్రజలకి తెలియజేయాలి… అన్యాయంగా నా మీద పెట్టిన తప్పుడు కేసులు మీద పూర్తి విచారణ జరిపి నాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు శేజల్.

Read more RELATED
Recommended to you

Latest news