పక్షం రోజుల్లో గ్రీవెన్స్‌ అర్జీలకు పరిష్కారం-సీఎం యోగీ

-

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లను ఆకట్టుకునే విధంగా అడుగులు వేస్తున్నారు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. పలు సంస్కరణలతో ఇప్పటికే యూపీలో మార్పులు తీసుకువచ్చిన యోగి. . . . ప్రజలకు చేరువయ్యే క్రమంలో మరో నిర్ణయం తీసుకున్నారు. గ్రీవెన్స్‌లో ప్రజలు అందించే అర్జీలకు పక్షం రోజుల్లో పరిష్కారం ఇస్తామని వారికి హామీ ఇస్తున్నారు. సమస్య పరిష్కారానికి నోచుకున్నాక నేరుగా వారితో మాట్లాడి లబ్దిదారుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. జనతా దర్శన్‌ కార్యక్రమంపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించాలని ఆదేశాలు కూడా చేశారు.

ఇటీవల గోరఖ్‌పూర్‌లో ప్రత్యేకంగా మూడు రోజుల పాటు జనతాదర్శన్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది యోగీ ప్రభుత్వం.ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అర్జీదారులు విచ్చేశారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ అర్జీలు అందించారు. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న సీఓం యెగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. ఇంటి సమస్యపై అధిక సంఖ్యలో అర్జీలు అందుకున్న యోగి… వారికి త్వరలోనే ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద గృహాలను మంజూరు చేస్తామని హమీ ఇచ్చారు. విద్యుత్‌ సరఫరా లేని ఇళ్ళకు త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని భరోసా కల్పించారు. పేదల భూములను ఆక్రమించుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశిస్తూ బాధితులకు త్వరగా న్యాయం చేయాలని సూచించారు. ఎక్కడ నిర్లక్ష్యం వహించినా అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు యోగీ.

ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమం పట్ల ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతున్నా…అధికారుల చర్యలపై సందేహాలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్ళూ అధికారుల నిర్లక్ష్యం వ్లలే సమస్యలు పరిష్కారం కాలేదని,మాఫియాతో వారు చేతులు కలిపి ప్రజలు వేధిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందుగా అధికారులను సక్రమమైన మార్గంలో నిలపాల్సిన అవసరం ఉందంటున్నారు. యంత్రాంగంపై పూర్తి స్థాయి నిఘా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news