లాఫియా చేపలు తింటే క్యాన్సర్ రాదు : సీఎం మమతా బెనర్జీ

-

చేపలు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. చేపలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. ఐరన్, మెగ్నీషియం, పోటాషియం, జింగ్, అయోడిన్ వంటివి చేపల్లో ఉంటాయి. చేపల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. చేపలు తినడం వల్ల విటమిన్-డి, బీ2, కాల్షియం, ఫాస్పరస్ శరీరానికి లభిస్తాయి. ఈ నేపథ్యంలో వారంలో కనీసం రెండుసార్లైన చేపలు తినాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే  తినడం వల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని, ముఖ్యంగా చర్మ క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని కొందరూ  సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.    లాఫియా చేపలు తింటే ఎలాంటి  క్యాన్సర్ రాదని వెల్లడించారు. ఆ చేపలు తింటే క్యాన్సర్ వస్తుందని కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారు. బాధ్యత లేని అలాంటి వ్యక్తులను శిక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇకపై ఇలాంటి ప్రచారం చేస్తే.. కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news