కేజ్రీవాల్‌ పీఎస్, సన్నిహితులపై ఈడీ దాడులు

-

దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా సమన్లు పంపుతున్న విషయం తెలిసిందే. ఆయన వరుసగా విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఈడీ అధికారులు సీఎం వ్యక్తిగత కార్యదర్శి బిభవ్‌ కుమార్‌కు చెందిన పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

అంతే కాకుండా కేజ్రీవాల్ సన్నిహితులపైనా ఈడీ దాడులు చేసింది. జల్‌ బోర్డు మాజీ సభ్యుడు శలబ్‌ కుమార్‌తో పాటు ఆప్‌ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి ఎన్డీ గుప్తా కార్యాలయంతోపాటు మరికొందరు నివాసాలు, కార్యాలయాల్లో  ఈడీ అధికారులు సోదాలు జరిపారు. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. .

ఈడీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు దిల్లీ కేబినెట్‌ మంత్రి అతిషి పేర్కొన్న మరుసటిరోజే ఈడీ సోదాలు జరగటం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. మరో మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ కూడా బీజేపీకి చెందిన బెదిరింపు విభాగం- ఈడీ గురించి కీలక విషయాలను గుట్టురట్టు చేయనున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news