దిల్లీ లిక్కర్ స్కామ్.. మరో ఆప్ మంత్రికి ఈడీ సమన్లు

-

దిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా, ఆప్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేసింది. ఇందులో కేజ్రీవాల్, కవితలు ప్రస్తుతం కస్టడీలో ఉండగా.. సిసోడియా, సంజయ్ సింగ్లు గత కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇంకా చాలా మంది ప్రముఖుల భాగస్వామ్యం ఉందని భావిస్తున్న ఈడీ ఆ దిశగా విచారణ సాగిస్తోంది.

ఈ క్రమంలోనే తాజాగా మరో నేతకు సమన్లు జారీ చేసింది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ మరో మంత్రి కైలాస్‌ గహ్లోత్‌కు నోటీసులు పంపింది. ఇవాళ విచారణకు హాజరుకావాలని సూచించింది. నజఫ్‌గడ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కైలాస్‌ గహ్లోత్‌ కేజ్రీవాల్‌ మంత్రివర్గంలో రవాణా, హోం, న్యాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దిల్లీ మద్యం కేసులో దిల్లీ మంత్రి కైలాస్‌ గహ్లోత్‌ను ప్రశ్నించటంతోపాటు ఆయన వాంగ్మూలం నమోదు చేసేందుకు సమన్లు పంపినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Latest news