తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన గుడ్డు ధర.. కానీ ?

అవును మీరు విన్నది నిజమే తెలుగు రాష్ట్రాల్లో గుడ్డు ధరలు తగ్గాయి. మొన్నటి దాకా ఏడు రూపాయల దాకా ఉన్న కోడి గుడ్డు ధర తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రైతు ధర 5 రూపాయల ఉండగా రిటైల్ మార్కెట్లో 5.50 పైసలకు అమ్ముతున్నారు. మొన్నటి వరకు రిటైల్ ఆరు నుంచి ఏడు రూపాయలు వరకు ఈ కోడిగుడ్డు విక్రయాలు జరిగాయి. అయితే మార్కెట్లో అన్ని నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటే కోడి గుడ్డు ధర మాత్రం తగ్గుతూ వస్తోంది. కోడిగుడ్డు ధర తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.

కరోనా ఎఫెక్ట్ తో ఏడు రూపాయలు దాకా చేరిన గుడ్డు ధర ఇప్పుడు నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఈ తగ్గుదల కూడా గత మూడు రోజులుగా నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం రైతు ధర 5 రూపాయల ఐదు పైసలు ఉండగా రిటైల్ ధర 5 రూపాయల యాభై పైసలకు చేరింది. కరోనా సహా అన్ని వ్యాధులకు సంబంధించి నివారణ శక్తి పెంచడానికి గుడ్డు ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో గుడ్డు వినియోగం పెరుగుతోంది. గతంలో పోలిస్తే కరోనా వచ్చాక రోజు గుడ్డు తినేవారికి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని చెబుతున్నారు. దాంతోనే గుడ్డు ధర విపరీతంగా పెరిగింది అని అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పట్టడం శుభ పరిణామం అని చెప్పాలి.