లోక్ సభ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం..!

-

2024 పార్లమెంట్ ఎన్నికలు అతి త్వరలోనే జరుగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాల చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ పార్లమెంట్ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితి పెంచినట్టు ఈసీఐ తెలిపింది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షలు ఖర్చు చేయవచ్చని స్పస్టం చేసింది.

అదేవిధంగా ఒక్కో నియోజకవర్గంలో తిరిగే వాహనాల సంఖ్యను 5 నుంచి 13 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు.. ఎస్సీ, ఎస్టీలకు 12,500 ఇతరులు రూ.25,000 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుందని.. పేర్కొంది. అలాగే అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషతో పాటు హిందీ, ఇంగ్లీషులో కూడా ఎన్నికల సంఘానికి సమర్పించాలని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news