వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా ఢిల్లీ రైతుల ట్రాక్టర్స్ ర్యాలీ.. రిహార్సల్స్ నేడే..

-

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులందరూ నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఢిల్లీలో 40రోజులుగా తమ గొంతు వినిపిస్తున్నారు. కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకి ఒరిగేది ఏమీ లేదని, దానివల్ల పారిశ్రామిక వేత్తలు లాభపడతారని, రైతుల స్వేఛ్ఛని అడ్డుకుంటాయని, వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని రైతులందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్ బంద్ లాంటి కార్యక్రమం నిర్వహించారు.

తాజాగా ట్రాక్టర్ల ర్యాలీకి శ్రీకారం చుట్టారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ వేదికగా ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టి, వ్యవసాయ చట్టాలపై తమ వ్యతిరేకత తెలియజేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రిహార్సల్ చేపట్టనున్నారు. అటు రైతులు తమ నిరసనని తెలియజేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఈ చట్టాల వల్ల రైతులకే లాభం ఎక్కువ అనీ కనీస మద్దతు ధర కూడా ఉంటుందనీ, రెండు రకాలుగా రైతు లాభపడతాడని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news