ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది మృతి!

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. కులు ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయాలపాలయ్యారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జు అయింది. జిల్లాలోని సైంజి కి వెళుతుండగా ఉదయం 8:30 గంటల సమయంలో జాంగ్లా వద్ద అదుపు తప్పిన బస్సు లోయలో పడిపోయిందని తెలిపారు.

ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ అశోక్ గార్గ్ మాట్లాడుతూ.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. జిల్లా అధికారులు, రెస్క్యూ టీం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడినవారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.