అజ్మీర్‌లో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. దెబ్బతిన్న రైలు ఇంజిన్!

-

ఇటీవలి కాలంలో దేశంలో రైలు ప్రమాదాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. అందుకు గల కారణాలు అధికారులకు అంతుచిక్కడం లేదు. అయితే,ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు రైలు పట్టాలపై రాళ్లు, కర్రలు, ఇనుమ ముక్కలు పెడుతున్నట్లు లోకోపైలట్లు, ట్రాక్ మెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు రెండ్రోజుల కిందట యూపీలోని కాన్పూర్ లోనూ రైల్వే ట్రాకు మీద ఏకంగా గ్యాస్ సిలిండిర్‌ను పెట్టగా రైలు దానిని ఢీకొట్టి ఆగిపోయింది. ప్రమాదాల వెనుక ఎవరో ఉన్నట్లు రైల్వే అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆకతాయిలను అరెస్టు చేసి విచారణ కూడా సాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రైలు ప్రమాదానికి కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఫూలేరా నుంచి అహ్మదాబాద్ రూట్ రైల్వే ట్రాక్ మీద కొందరు దుండగులు 70 కేజీల సిమెంట్ దిమ్మెను అమర్చారు.దీంతో రైలు ఆ దిమ్మెను ఢీకొట్టి లాక్కుని వెళ్లింది. దీంతో ట్రైన్ ఇంజిన్లో కొంత భాగం డ్యామేజ్ అయ్యినట్లు రైల్వే అధికారులు ధృవీకరించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. వరుస రైలు ప్రమాదాల నేపథ్యంలో దేశంలో రాజకీయ సంక్షోభం, అశాంతిని నెలకొల్పేందుకు కొందరు కుట్ర పన్నినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news