యూపీలంతే యూపీలంతే… వారిపై దేశద్రోహం కేసు!!

-

పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటారు కానీ.. పోరాడినా, బాధితలకు అండగా నిలిచినా “దేశద్రోహం” కేసులు పెడుతున్నారు యూపీ పోలీసులు! యోగి ముఖ్యమంత్రిగా సాధించిన మరో ఘనత ఇదనే కామెంట్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి! ఇందుకు తాజాగా యూపీ డీజీపీ(లా అండ్‌ ఆర్డర్‌) ప్రశాంత్‌ కుమార్ చెప్పిన కబుర్లే కారణం!

హథ్రాస్‌ దుర్ఘటనకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌ పోలీసుల వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రియాంక గాంధీపై విచక్షణ మరిచి ప్రవర్తించడం.. బాధితులకు వ్యతిఏకంగా ఏర్పాటుచెసిన సమావేశానికి అనుమతి ఇవ్వడం బధ్రత కల్పించడం.. అర్థరాత్రే బాధితురాలి మృతదేహానికి అత్యంక్రియలు చేయడం! ఇవి చాలవన్నట్లు తాజాగా 19 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు యూపీ పోలీసులు!

అవును… హథ్రాస్‌ దుర్ఘటనకు సంబంధించి స్పందించిన వారిలో మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయని.. ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని.. ఈ కేసుకు సంబంధించి కొంతమందిపై ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు చేశామని డీజీపీ చెప్పుకొచ్చారు! అలా ఉంది యూపీలో సన్యాసి యోగి ముఖ్యమంత్రిగా పాలన – పోలీసుల ఫెర్ఫార్మెన్స్!!

 

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news