హైదరాబాదులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సిద్దింబర్ బజార్ లోని రాజధాని మోటార్స్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బంది కి ఫోన్ చేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు.
ఇక ప్రమాదం షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుందని ప్రాథమికంగా పోలీస్ అధికారులు నిర్ధారణ చేశారు.ఇక ఈ ప్రమాదంలో 10 లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం కలిగిందని వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన సమయంలో మార్కెట్ లో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని స్థానికులు తెలియజేశారు.